తానూర్ బీడీ కార్మికులు, వృద్ధులకు వెంటనే పింఛన్లు ఇవ్వాలి*
*బీజేపీ మండల అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి డిమాండ్*
ఆగస్టు 15 నుంచి అర్హులకు పింఛన్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు బీడీ కార్మికులు, వృద్ధులకు మొండిచెయ్యి చూపడం సరికాదని బీజేపీ మండల అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి అన్నారు. తానూర్ మండలంలోని అర్హులైన బీడీ కార్మికులు, వృద్ధులకు ఇప్పటి వరకు ఒక్క పింఛన్ కూడా రాలేదు. రోజువారీ కూలీతో జీవిస్తున్న బీడీ కార్మికులు, ఆధారంలేని వృద్ధులు ఈ పెన్షన్ కోసం ఎదురుచూస్తున్నారు" అని తెలిపారు.ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హుల జాబితాను పూర్తి చేసి, పెన్షన్లు విడుదల చేయాలని ఆయన కోరారు. లేకుంటే ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆదేశాల మేరకు బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.












