నిజామాబాద్, 2026-06-05
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని వేల్పూర్ రెవెన్యూ శివారులో గల శ్రీ శ్రీ శ్రీ గోవింద గిరి స్వామి దివ్య యోగాశ్రమంలోని శివాలయంలో స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సర ఆషాడ ద్వాదశి సోమవారం పరమేశ్వరుని జన్మ నక్షత్రం కలిసి రావడంతో, ఆలయ అర్చకులు జన్మంచి ప్రవీణ్ కుమార్ పంతులు ఆధ్వర్యంలో శివలింగానికి మహాన్యాస రుద్రాభిషేకం, అన్నపూజ (అన్నాభిషేకం) శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని వేల్పూర్ రెవెన్యూ శివారులో గల శ్రీ శ్రీ శ్రీ గోవింద గిరి స్వామి దివ్య యోగాశ్రమంలోని శివాలయంలో స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సర ఆషాడ ద్వాదశి సోమవారం పరమేశ్వరుని జన్మ నక్షత్రం కలిసి రావడంతో, ఆలయ అర్చకులు జన్మంచి ప్రవీణ్ కుమార్ పంతులు ఆధ్వర్యంలో శివలింగానికి మహాన్యాస రుద్రాభిషేకం, అన్నపూజ (అన్నాభిషేకం) శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. విశ్వకళ్యాణార్థమై ఆశ్రమ ప్రాంగణంలో మృత్యుంజయ హోమాన్ని సైతం అత్యంత వైభవంగా నిర్వహించారు.
అభిషేకాలు, అలంకరణ
అభిషేకాలు అనంతరం శివలింగాన్ని చూపరుల దృష్టిని ఆకర్షించే విధంగా అందంగా అలంకరించారు. ఈ మహోత్సవంలో ఆర్మూర్ పట్టణానికి చెందిన కొండ స్వరూప అశోక్ గౌడ్ దంపతులు, కుంట సువర్ణ, అబ్బగోని జగదీశ్వర్ గౌడ్, వేల్పూర్ కు చెందిన నోముల సులోచన గంగారెడ్డి దంపతులు, సాయిరాం బాల్రాజ్, గడ్డం మల్లేష్, కనికరం లక్ష్మి, రాధిక తదితరులు పాల్గొన్నారు.
అన్నదానం, భక్తుల భాగస్వామ్యం
వేల్పూర్ మండలంలోని మోతె గ్రామానికి చెందిన నరేష్ కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. హోమం, రుద్రాభిషేకం కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గోవింద గిరి స్వామి శిష్యులు, శివ భక్తులు, తదితరులు పాల్గొన్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.












