నిర్మల్, 21 July
లక్ష్మణ చందా మండల కేంద్రంలోని శ్రీ మార్కండేయ ఆలయానికి ప్రహరీ గోడ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం దేవాదాయ శాఖ నుండి రూ. 17,50,000 ప్రొసీడింగ్ మంజూరైంది. అయితే, ఈ నిధులు త్వరగా విడుదల చేయాలని కోరుతూ పద్మశాలి సంఘ సభ్యులు నిర్మల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావుకు వినతిపత్రం సమర్పించారు.
లక్ష్మణ చందా మండల కేంద్రంలోని శ్రీ మార్కండేయ ఆలయానికి ప్రహరీ గోడ నిర్మాణానికి సంబంధించిన నిధుల మంజూరీకై పద్మశాలి సంఘ సభ్యులు వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దేవాదాయ శాఖ నుండి ఈ ఆలయానికి రూ. 17,50,000 ప్రొసీడింగ్ ఇచ్చింది.
సంఘ సభ్యులు అందరూ కలిసి త్వరితగతిన ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి చేసి, ఎంబీ రికార్డు చేసి, ఈ నిధులు త్వరగా మంజూరు అయ్యేలా చూడాలని కోరుతూ నిర్మల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావుకు వినతిపత్రం అందించారు.
వినతిపత్రం అందుకున్న శ్రీహరి రావు సానుకూలంగా స్పందించి, త్వరలోనే దేవాదాయ శాఖ నుండి నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నరేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సోమా భీమ్ రెడ్డి, ఈటెల శ్రీనివాస్, పద్మశాలి సంఘ సభ్యులు నాగేష్, రజనీకాంత్, సాగర్, సంతోష్, రాములు, ముత్తన్న, నరసయ్య, ప్రవీణ్, శ్రీనివాస్, శంకర్, రాజశేఖర్, రవి, నరేష్, పోశెట్టి, లక్ష్మన్న మరియు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.











