హైదరాబాద్, జూన్ 18, 2024
దనపనవైనషఢృఎోపననద.ఈోఅనేపడుుఉవుుోటుేుుట.అవనునుఇదఅశేషఠైనపణబడుుద.
చాంద్రమానం ప్రకారం సంవత్సరంలో నాల్గవ మాసమైన ఆషాఢం, ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాముఖ్యత కలిగినది. పూర్వాషాడ, ఉత్తరాషాఢ నక్షత్రాల సమీపంలో చంద్రుడు సంచరించడం వల్ల దీనికి ఆషాఢమాసం అని పేరు వచ్చింది. ఈ మాసానికి 'శూన్య మాసం' అని కూడా పేరున్నా, ఆధ్యాత్మిక సాధనకు, అమ్మవారి ఆరాధనకు ఇది అత్యంత శ్రేష్ఠమైనదిగా పరిగణించబడుతుంది.
ఆషాఢ మాసంలో అనేక ముఖ్యమైన పండుగలు, ఉత్సవాలు చోటు చేసుకుంటాయి. గోల్కొండ కోటలోని జగదాంబ ఆలయంలో బోనాల వేడుకలు ప్రారంభమవుతాయి. అలాగే, పూరీ జగన్నాథ రథోత్సవం ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది. శుద్ధ సప్తమిని 'భా'ను సప్తమి'గా, సూర్యారాధనకు ఉద్దీష్టమైన దినంగా జరుపుకుంటారు. తెలంగాణ ప్రాంతంలో 'బోనాల జాతర'ను ఘనంగా నిర్వహిస్తారు.
ఆషాఢ శుద్ధ ఏకాదశిని 'తొలి ఏకాదశి' లేదా 'శయనైకాదశి' అని కూడా అంటారు. ఈ రోజున మహావిష్ణువు పాలసముద్రంలో శయనిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఏకాదశి వ్రతం భగవంతుని సాక్షాత్కారాన్ని పొందడానికి దోహదపడుతుందని విశ్వాసం. పండరీపురంలో తొలి ఏకాదశి నాడు మహోత్సవాలు జరుపుతారు, ఎందుకంటే సతీ సక్కుబాయికి ముక్తి లభించింది ఈ ఏకాదశి నాడే.
ఆషాఢ మాసం కొన్ని ఆచారాలకు, నియమాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఈ మాసంలో కొత్త నీరు తాగడం వల్ల వచ్చే అనారోగ్యాలను నివారించడానికి, అలాగే వాతావరణ మార్పులకు అనుగుణంగా శరీరాన్ని సిద్ధం చేయడానికి కొన్ని నియమాలు పాటించాలని సూచిస్తారు. గోరింటాకు పెట్టుకోవడం, ములగ కూర, అనపపప్పు వంటివి తినడం ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. ఈ మాసంలో వాతావరణం చల్లబడటం వల్ల వచ్చే కఫ దోషాలను తగ్గించడానికి గోరింటాకు సహాయపడుతుందని నమ్ముతారు.
ఈ మాసంలోనే దక్షిణాయన పుణ్యకాలం కర్కాటక సంక్రమణంతో ప్రారంభమవుతుంది. ఈ కాలంలో పితృదేవతలకు శ్రాద్ధకర్మలు నిర్వహించడం, గురుపూర్ణిమ వంటి విశేషాలు చోటు చేసుకుంటాయి. విజయవాడ కనకదుర్గాదేవి శాకంబరీ అలంకార ఉత్సవాలు, ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర కూడా ఈ మాసంలోనే జరుగుతాయి. ఆషాఢమాసం ఆధ్యాత్మికతతో పాటు, అనేక సాంస్కృతిక, సామాజిక ఆచారాలకు నెలవు.












