నిజామాబాద్, జూలై 15
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలక మండలి డైరెక్టర్‌గా నియమితులైన ఎం. రాఘవేందర్‌రావుకు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా దేవస్థాన అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి ఆయన కృషి చేయాలని ఆకాంక్షించారు.
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హయాంలో పునర్నిర్మించబడిన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలక మండలి డైరెక్టర్‌గా నియమితులైన ఎం. రాఘవేందర్రావును మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ సంస్థ అధ్యక్షుడు అమర్నాథ్రావు, సుబ్బరాజులు తదితరులు పాల్గొన్నారు.
నూతన బాధ్యతలు స్వీకరించిన రాఘవేందర్రావు యాదాద్రి దేవస్థానం అభివృద్ధికి కృషి చేయడంతో పాటు, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేలా విజయవంతంగా విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు.
యాదాద్రి క్షేత్రం ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే దిశగా ఆయన సేవలు కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు రాఘవేందర్‌రావుకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలియజేశారు.












