గద్వాల, 2026-08-10
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన వైద్య విద్యార్థిని ప్రియాంక భౌతికకాయానికి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు నివాళులర్పించారు. ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

అంత్యక్రియల్లో మంత్రి పాల్గొని నివాళులు
ప్రియాంక స్వస్థలమైన గద్వాల్ జిల్లా అయిజ మండలం ఎక్లాస్‌పూర్‌లో సోమవారం నిర్వహించిన అంతిమయాత్రలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియాంక భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ప్రియాంక కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
నిందితులపై కఠిన చర్యలు తప్పవని హామీ
ఈ ఘటనకు బాధ్యులైన నిందితులు ఎంతటివారైనా ఉపేక్షించబోమని మంత్రి స్పష్టం చేశారు. చట్ట ప్రకారం కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. ప్రియాంక కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.