నిర్మల్ పట్టణంలోని ఎస్వీఆర్ చిల్డ్రన్ హాస్పిటల్లో వైద్యుడు, సిబ్బందిపై దాడి చేసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం బిల్లు పెంచాలని కోరగా, వైద్యుడు నిరాకరించడంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
పట్టణంలోని ఎస్వీఆర్ చిల్డ్రన్ హాస్పిటల్లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులు వైద్యుడిని, సిబ్బందిని దుర్భాషలాడుతూ, భౌతికంగా దాడికి పాల్పడ్డారని సమాచారం.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. దాని ఆధారంగా, దాడికి పాల్పడిన నలుగురు వ్యక్తులను గుర్తించి, వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మహమ్మద్ సల్మాన్ హుస్సేన్ (27), మహమ్మద్ షౌకత్ (28), షాబాద్ అలీ (26), మహమ్మద్ ఆజాద్ హుస్సేన్ (21) ఉన్నట్లు గుర్తించారు.
అరెస్ట్ అయిన నిందితులను విచారణ నిమిత్తం రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. వైద్యులపై దాడులను సహించేది లేదని, చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల హెచ్చరికలు జారీ చేశారు. వైద్యుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని ఆమె పేర్కొన్నారు.








