హైదరాబాద్, జులై 06
హైదరాబాద్‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టులో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. కోర్టు భవనం మూడో అంతస్తులో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
హైదరాబాద్‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టులో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోర్టు భవనం మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
హుటాహుటిన అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించి, ఇతర అంతస్తులకు మంటలు వ్యాపించకుండా అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.
కాగా, షార్ట్‌సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని అధికారులు వెల్లడించారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆస్తి నష్టం ఎంతమేరకు జరిగిందనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.












