శ్రీరామపురం (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 06
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా శ్రీరామపురంలో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ భార్య, తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన దారుణం వెలుగుచూసింది. భర్త సంపాదించిన డబ్బుతోనే ఈ హత్యకు సుపారీ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
ఏడు అడుగుల అనుబంధానికి మచ్చ తెచ్చేలా, అక్రమ సంబంధాల కారణంగా భర్త లేదా భార్య బలైపోతున్న ఘటనలు పెరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా శ్రీరామపురంలో భర్త అప్పలనాయుడును భార్య హైమా సుపారీ ఇచ్చి ఇంట్లోనే హత్య చేయించింది. ఈ దారుణానికి భర్త సంపాదించిన డబ్బుల్నే ఆమె ఉపయోగించింది.
ప్రియుడు గంగాధర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న హైమా, తన భర్త అప్పలనాయుడు అడ్డుగా ఉన్నాడని భావించి హత్య చేయించినట్లు తెలిసింది. ఈ ఘటనతో వారిద్దరు పిల్లలు తండ్రిని కోల్పోయారు. ఈ కేసులో పోలీసులు హైమా, గంగాధర్‌తో పాటు మరొకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.












