హైదరాబాద్, 16 July
తన కుమారుడు భరత్ రెడ్డి డ్రగ్స్ తీసుకున్నట్లు, అరెస్ట్ అయినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. మంగళ్ హాట్ పోలీసులు డ్రగ్స్ కేసుపై తమ ఇంట్లో విచారించినట్లు ఆయన తెలిపారు.
తన కుమారుడు భరత్ రెడ్డి డ్రగ్స్ తీసుకున్నట్లు, అరెస్ట్ అయినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. మంగళ్ హాట్ పోలీసులు తమ ఇంటికి వచ్చి డ్రగ్స్ కేసుపై విచారణ చేస్తున్నామని, సహకరించాలని కోరారని ఆయన తెలిపారు. కామన్ ఫ్రెండ్స్ ఫోన్ జాబితాలోని ఒక నంబర్ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు విచారించారని, అయితే తన కుమారుడు డ్రగ్స్ తీసుకోలేదని, అరెస్ట్ కూడా కాలేదని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు.











