హైదరాబాద్, 16 July
హైదరాబాద్‌లో డ్రగ్స్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఒక ఎమ్మెల్సీ కుమారుడు, అతనితో పాటు మరో ముగ్గురు డ్రగ్స్ కొనుగోలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వీరి నుంచి సేకరించిన బ్లడ్ శాంపిల్స్‌ను వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లో ఓ ఎమ్మెల్సీ కుమారుడు డ్రగ్స్ కొనుగోలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ తీసుకుంటున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో ఎమ్మెల్సీ కుమారుడు భరత్‌తో పాటు మరో ముగ్గురు డ్రగ్స్ కొనుగోలు చేస్తూ పట్టుబడ్డారు. వారి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించిన పోలీసులు, వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితుల పూర్తి వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.











