కొత్తగూడెం, జూలై 15, 2026
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం 2వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై పలువురు వ్యక్తులు వేర్వేరు రోజుల్లో లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం 2వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై పలువురు వ్యక్తులు వేర్వేరు రోజుల్లో లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు మారి రామకృష్ణ ప్రేమ పేరుతో నమ్మించి, జూలై 3న జాలే నవీన్, గణేష్ సహకారంతో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం జూలై 4న విజేందర్, జూలై 5న మహేష్ కూడా బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. జూలై 11న బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.












