*🚨 (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 28
హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్, ఈగిల్ ఫోర్స్ తెలంగాణ, రామ్‌గోపాల్‌పేట్ పోలీసులు సంయుక్తంగా పారడైజ్ సర్కిల్ వద్ద డ్రగ్స్ డెలివరీ యత్నాన్ని అడ్డుకున్నారు. కిమ్స్ సన్‌షైన్ ఆస్పత్రి సమీపంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్, ఈగిల్ ఫోర్స్ తెలంగాణ, రామ్‌గోపాల్‌పేట్ పోలీసులు సంయుక్తంగా పారడైజ్ సర్కిల్ వద్ద డ్రగ్స్ డెలివరీ యత్నాన్ని భగ్నం చేశారు. కిమ్స్ సన్‌షైన్ ఆస్పత్రి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ క్రమంలో మెఫెడ్రోన్ డ్రగ్‌ను తరలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4 గ్రాముల మెఫెడ్రోన్, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, స్వాధీనం చేసుకున్న డ్రగ్ విలువ సుమారు రూ.12 వేలు.
నగరంలో డ్రగ్స్ సరఫరాను అడ్డుకోవడంలో ఈ ఆపరేషన్ కీలక పాత్ర పోషించిందని, ఈ కేసుపై మరింత దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.












