నిజామాబాద్, 30 July
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సన్నిహితుడిగా చెప్పబడుతున్న కాపర్తి శ్రవణ్, నిజామాబాద్ జిల్లాలోని తన ధాన్యం మిల్లుల నుంచి రూ. 66 కోట్ల విలువైన 2,03,688 క్వింటాళ్ల ధాన్యాన్ని రెండున్నరేళ్లుగా దోచుకున్నట్లు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. దీనిపై ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సన్నిహితుడు, కాపర్తి శ్రవణ్ రూ. 66 కోట్ల విలువైన 2,03,688 క్వింటాళ్ల ధాన్యాన్ని పక్కదారి పట్టించి దోచుకున్నట్లు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. నిజామాబాద్ జిల్లా కాలూరు గ్రామంలోని శ్రీ సిద్ధి రామేశ్వర అగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ధాన్యం మిల్లు గోడౌన్ల నుంచి ఈ ధాన్యం అపహరణకు గురైనట్లు నిర్ధారించారు.
గత రెండున్నరేళ్లుగా ఈ దోపిడీ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. జూలై 22న జరిగిన తనిఖీల్లో కాపర్తి శ్రవణ్ రూ. 66.12 కోట్ల విలువైన ధాన్యాన్ని స్వాహా చేసినట్లు ఆధారాలు లభించాయి. దీనిపై కాపర్తి శ్రవణ్‌పై BNS సెక్షన్లు 316(2), 316(5), 318(4), సెక్షన్ 7 కింద అధికారులు కేసు నమోదు చేశారు.
ప్రజల సొమ్ము అయిన రూ. 66 కోట్లను వడ్డీ, పెనాల్టీలతో సహా కాపర్తి శ్రవణ్ నుంచి వసూలు చేస్తారా? లేక రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో కేసును నీరుగారుస్తారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.











