నిజామాబాద్, 07-07-2026
నిజామాబాద్ జిల్లా న్యాల్కల్ గ్రామంలో భర్త ప్రశాంత్ హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ హత్య కేసులో భార్య సంధ్య ఆడియో వైరల్‌గా మారడంతో కేసు మరింత కలకలం రేపుతోంది. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని భర్తను హత్య చేయించినట్లు ఆడియోలో తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా న్యాల్కల్ గ్రామంలో వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని భర్త ప్రశాంత్‌ను సంధ్య అనే మహిళ హత్య చేయించిన సంఘటన కలకలం రేపింది. తాజాగా ఈ కేసులో భార్య సంధ్య ఆడియో వైరల్‌గా మారింది. అందులో తన ప్రియుడు బంటితో ఆమె మాట్లాడినట్లు తెలుస్తోంది.
భర్త హత్యకు ముందు, "వాడికి బాగా తాగించి పడుకోబెట్టు, సరిపోకపోతే ఇంకా తెప్పించు.. వాడు కిందకి రావొద్దు" అని సంధ్య తన ప్రియుడితో పథకం పన్నినట్లు ఈ ఆడియో ద్వారా వెల్లడైంది.












