మండలంలోని విట్టాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశాలు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ చేతుల మీదుగా ఘనంగా జరిగాయి. లబ్ధిదారుల నూతన గృహాల్లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, గృహప్రవేశాలు చేయించి శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ, పేద కుటుంబాలకు సొంత ఇంటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లతో పాటు అన్ని సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.
విట్టాపూర్ గ్రామ సర్పంచ్ సిందే లింగురాం పటేల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అల్లాడి వనజ, తాహసిల్ దార్ ఆడే కమల్ సింగ్, ఎంపీపీ రమణారావు, మాజీ ఎంపీపీ అప్క గజ్జారాం, స్థానిక నాయకులు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
నూతన గృహాల్లోకి అడుగుపెట్టిన లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి మరియు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గృహప్రవేశ కార్యక్రమం విట్టాపూర్ గ్రామంలో పండుగ వాతావరణాన్ని సృష్టించింది.












