అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) మహిషా శాఖ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని భైంసా పట్టణంలోని జీపీ లడ్డ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు.
మహిషా హిందూ ఉత్సవ సమితి సహ కార్యదర్శి కనికరం శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో కళాశాల ప్రిన్సిపల్ సంజీవ్ కుమార్, యజమాన్య సభ్యులు మెంచు శివాజీ, కుంటాల రవి, భోజన్న కూడా పాల్గొన్నారు.
ఏబీవీపీ కార్యకర్తలు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా, శివాజీ మహారాజ్ జీవితం, ఆయన చూపిన ధైర్యసాహసాలు, ప్రజల సంక్షేమం కోసం చేసిన కృషి గురించి వక్తలు ప్రస్తావించారు.
మహారాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవమైన శివాజీ మహారాజ్ స్ఫూర్తిని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచించారు.


