నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలంలోని మలక్ చించోలిలో గల మల్లికార్జున స్వామి (మల్లన్న) ఆలయ జాతర ఉత్సవాలు బుధవారం రాత్రి భక్తిశ్రద్ధలతో ముగిశాయి. ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
మంగళవారం మల్లన్న శావ పల్లకి ఊరేగింపుతో ప్రారంభమైన జాతర, బుధవారం రాత్రి స్వామి ఉత్సవమూర్తి పల్లకి సేవతో కొనసాగింది. భక్తులు సమర్పించిన అంబళ్లను భజనకీర్తనలతో ఆలయానికి తీసుకువచ్చి, స్వామికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం అందజేశారు.
గురువారం ఉదయం అన్నపూజ అనంతరం, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

