నిజామాబాద్, జూలై 5
నిజామాబాద్ నగరంలో రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ 10వ ఇన్స్టాలేషన్ సెర్మనీ, అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించింది. అధ్యక్షుడు పడాల సత్తయ్య, కార్యదర్శి తాటిపాముల రాంప్రసాద్, కోశాధికారి అల్లాడి నాగరాజు బాధ్యతలు చేపట్టారు.
నిజామాబాద్ నగరంలోని రోటరీ నగర్లో రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ ఆధ్వర్యంలో 10వ ఇన్స్టాలేషన్ సెర్మనీ, అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించింది. రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ అధ్యక్షుడిగా పడాల సత్తయ్య, కార్యదర్శిగా తాటిపాముల రాంప్రసాద్, కోశాధికారిగా అల్లాడి నాగరాజు బాధ్యతలు చేపట్టారు. అనంతరం నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు పడాల సత్తయ్య మాట్లాడుతూ, క్లబ్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇన్స్టాలేషన్ సెర్మనీని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రోటరీ సభ్యులు హాజరుకావడం సంతోషకరమన్నారు. రాబోయే రోజుల్లో రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ సేవా కార్యక్రమాల్లో మరింత చురుకైన పాత్ర పోషిస్తూ సమాజాభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పబ్లిక్ ఇమేజ్ చైర్మన్ వాసు శ్రీనివాస్, రోటరీ క్లబ్ సభ్యులు, ఆహ్వానితులు తదితరులు పాల్గొన్నారు.












