కుంటాల, జూలై 4
కుంటాల మండలంలోని పెంచకల్పాడ్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ పటేల్ ఇటీవల మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులను శనివారం కుంటాల మాజీ ఎంపీపీ, బీజేపీ నాయకుడు జీ.వి. రమణారావు పరామర్శించారు. మృతుడి కుటుంబానికి ఆయన తన అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
కుంటాల మండలంలోని పెంచకల్పాడ్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ పటేల్ ఇటీవల మృతి చెందగా, శనివారం కుంటాల మాజీ ఎంపీపీ, బీజేపీ నాయకుడు జీ.వి. రమణారావు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని, వారికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ధైర్యంగా ఉండాలని సూచిస్తూ కుటుంబానికి తన వంతు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంఘం అధ్యక్షుడు లింగారం పటేల్, స్థానిక సర్పంచ్ హిమ్మత్రావు పటేల్, మాజీ సర్పంచ్ దిగాంబర్ పటేల్, సొసైటీ వైస్ చైర్మన్ కిష్టయ్య, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.












