కుబీర్, జూలై 2
కుబీర్ మండలంలోని సేవాదాస్ నగర్ కు చెందిన ఐటీ అధికారి, సామాజిక సేవకుడు రాథోడ్ ప్రకాష్ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అభిమానులు బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచుకున్నారు. రాథోడ్ ప్రకాష్ పేద ప్రజలకు అండగా నిలుస్తూ, అవసరమైన వారికి సహాయం అందిస్తున్నారని పలువురు కొనియాడారు.
కుబీర్ మండలంలోని మారుమూల గ్రామమైన సేవాదాస్ నగర్ కు చెందిన ఐటీ అధికారి, సామాజిక సేవకుడు రాథోడ్ ప్రకాష్ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు బాణాసంచా పేల్చి, కేక్ కట్ చేయించి, ఒకరికొకరు మిఠాయిలు పంచుకొని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రాథోడ్ మహేందర్ పలువురు మాట్లాడుతూ రాథోడ్ ప్రకాష్ పేద ప్రజలకు అండగా నిలుస్తూ, అవసరమైన సమయంలో సహాయం అందించే వ్యక్తిగా మంచి గుర్తింపు పొందారని కొనియాడారు. కష్టసుఖాల్లో ప్రజలకు తోడుగా ఉండే ఆయన సేవాభావం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.
అనంతరం రాథోడ్ ప్రకాష్‌కు పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా సన్మానించారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అభిమానులు, గ్రామ పెద్దలు, యువకులు, స్నేహితులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.











