రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన జర్నలిస్టు గజ్జల శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబానికి అండగా నిలిచేందుకు బోయినిపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తోటి జర్నలిస్టులు ఆర్థిక సహాయం అందించారు.
ఆర్థిక సహాయం అందజేత
శనివారం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన బోయినిపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు గడ్డం తిరుపతి, అతికం రాజశేఖర్ గౌడ్, గజ్జల శ్రీనివాస్ కుటుంబానికి రూ.7,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి తాము అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు.
ప్రెస్ క్లబ్ భరోసా
జర్నలిస్టుల కుటుంబాలకు అవసరమైన సమయంలో సహాయ సహకారాలు అందించేందుకు ప్రెస్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని, ఈ విషయంలో తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. తోటి జర్నలిస్టుల కుటుంబానికి తోటి జర్నలిస్టులు ఆర్థిక సహాయం అందించడం పట్ల పలువురు అభినందించారు.












