ముధోల్, 2026-08-08
ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ గ్రామంలో గల ప్యూచర్ పాఠశాలలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బోనాల పండుగ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి, పోతరాజు, శివసత్తుల వేషధారణలతో ఆకట్టుకున్నారు.
ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ గ్రామంలో గల ప్యూచర్ పాఠశాలలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బోనాల పండుగ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి, పోతరాజు, శివసత్తుల వేషధారణలతో ఆకట్టుకున్నారు. బోనాలను నెత్తిన ఎత్తుకొని పోతరాజు, శివసత్తులు తెలంగాణ బోనాల పండుగ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేశారు.
పండుగ ప్రాముఖ్యత
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున బోనాల పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. బోనాలు తెలంగాణ ప్రజల భక్తి, సంస్కృతి, ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. బోనాల పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.












