సారాంశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ పొందుతున్న సుమారు 5,560 మంది ఎస్సీటీపీసీ () కానిస్టేబుళ్లకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయం నుంచి నిర్వహించారు.
ముఖ్య విషయాలు
- 1ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ పొందుతున్న సుమారు 5,560 మంది ఎస్సీటీపీసీ () కానిస్టేబుళ్లకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
- 2ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ, పోలీసు విధుల్లో మానసిక ఒత్తిడి సహజమే అయినప్పటికీ, దానిని సమర్థవంతంగా అధిగమించే మార్గాలను అలవర్చుకోవాలని సూచించారు.
- 3నిజాయితీ, క్రమశిక్షణ, ఓర్పు అనే విలువలు ప్రతి పోలీసు అధికారి, సిబ్బందిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని పేర్కొన్నారు.
- 4ఈ కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయం నుంచి నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ పొందుతున్న సుమారు 5,560 మంది ఎస్సీటీపీసీ () కానిస్టేబుళ్లకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయం నుంచి నిర్వహించారు.
మానసిక ఒత్తిడి అధిగమించాలి
ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ, పోలీసు విధుల్లో మానసిక ఒత్తిడి సహజమే అయినప్పటికీ, దానిని సమర్థవంతంగా అధిగమించే మార్గాలను అలవర్చుకోవాలని సూచించారు. నిజాయితీ, క్రమశిక్షణ, ఓర్పు అనే విలువలు ప్రతి పోలీసు అధికారి, సిబ్బందిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని పేర్కొన్నారు.
ప్రజలు పోలీస్ స్టేషన్కు ఆశ్రయంగా వస్తారని, కష్టాల్లో ఉన్న వారి సమస్యలను ఓర్పుతో విని, సహానుభూతితో స్పందించడం ద్వారా పోలీసు ఉన్నారనే భరోసా ప్రతి పౌరుడిలో కల్పించగలమని అన్నారు. చిరాకు, ఆవేశం ప్రదర్శించడం వల్ల ఫిర్యాదుదారులు మరింత మనోవేదనకు గురవుతారని తెలిపారు.