ప్రొద్దుటూరు, 4 September
ప్రొద్దుటూరులో అనారోగ్యంతో మృతి చెందిన గుర్తుతెలియని వ్యక్తికి బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు మానవత్వం చాటుకున్నారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచిన అనంతరం, పోలీసుల అభ్యర్థన మేరకు ఫౌండేషన్ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.
బంధువులు దూరమైనా.. మానవత్వం మాత్రం చేరువైంది గుర్తుతెలియని మృతదేహానికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ అంత్యక్రియలు ప్రొద్దుటూరు అనారోగ్యంతో మృతి చెందిన గుర్తుతెలియని వ్యక్తికి బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు మానవత్వం చాటుకున్నారు. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందగా, మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో పోలీసు సిబ్బంది మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ పట్టణ అధ్యక్షుడు సుబహాన్‌ను ఫోన్ ద్వారా సంప్రదించారు.పోలీసుల సమాచారం అందుకున్న ఫౌండేషన్ సభ్యులు వెంటనే స్పందించి శనివారం హిందూ స్మశానవాటికలో హిందూ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి ఆప్తులు ఎవరూ లేకపోయినా గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు పూర్తి చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్‌రావు, పట్టణ అధ్యక్షుడు సుబహాన్, అశోక్, సతీష్, గౌస్, సలీం తదితరులు పాల్గొని అంత్యక్రియలను పూర్తి చేశారు.ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ సమాజంలో ఎవరూ లేని వారికి కూడా గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు జరగాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. వృద్ధులకు సహాయం చేయండి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఆధ్వర్యంలోని శ్రీ అమ్మ శరణాలయంలోని వృద్ధులకు సహాయం చేయదలచిన దాతలు సంప్రదించాలని ఫౌండేషన్ సభ్యులు కోరారు. సంప్రదించాల్సిన నంబర్లు: 82972 53484 9182244150











