తానూర్, 4 September
మండలం ఝరి బి గ్రామంలో లకపతి వార్ రాజు కుటుంబానికి మంజూరైన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మేకల దేవీదాస్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు గైక్వాడ్ సాయినాథ్ హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో మేకల దేవీదాస్ మండలం ఝరి బి గ్రామంలో లకపతి వార్ రాజు కుటుంబానికి మంజూరైన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మేకల దేవీదాస్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు గైక్వాడ్ సాయినాథ్ హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మేకల దేవీదాస్ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉందన్నారు. ఝరి బి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరై గృహప్రవేశం చేసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు వేధం బొజ్జు పటేల్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముధోల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ఝరి బి గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం మరింతగా కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామస్తులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.











