తానూరు (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 19
తానూరు మండలంలోని కోలూరు గ్రామంలో ఇటీవల మరణించిన ముగ్గురు కుటుంబాలను ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి గారు పరామర్శించారు. కాంగ్రెస్ నాయకులు ధర్మేందర్ కుమార్తె, గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ నాగు రావు, మున్నూరు కాపు సంఘం మాజీ అధ్యక్షులు హన్మాండ్లు తల్లి మరణించిన కుటుంబాలను ఆయన కలిసి ఓదార్చారు.
తానూరు మండలంలోని కోలూరు గ్రామంలో పలువురు మరణించిన బాధిత కుటుంబాలను ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి గారు పరామర్శించారు.
కోలూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవ ధర్మేందర్ గారి చిన్న కుమార్తె అనారోగ్యంతో మరణించడంతో, వారి కుటుంబ సభ్యులను విఠల్ రెడ్డి కలిసి ఓదార్చారు.
అదే గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ గౌరవ నాగు రావు గారు కూడా మరణించడంతో, ఆయన కుటుంబ సభ్యులను కూడా వెళ్లి పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అంతేకాకుండా, అదే గ్రామానికి చెందిన మున్నూరు కాపు సంఘం మాజీ అధ్యక్షులు హన్మాండ్లు గారి తల్లి కొద్ది రోజుల క్రితం మరణించగా, వారి కుటుంబ సభ్యులను కూడా విఠల్ రెడ్డి కలిసి పరామర్శించారు.
మాజీ శాసనసభ్యుల వెంట మాజీ జిల్లా జడ్పీ చైర్మన్ రాజన్న, మాజీ జడ్పిటిసి ఉత్తమ్ భలే రావు, మాజీ ఆత్మ చైర్మన్ పోత రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, తానుర్ గ్రామ సర్పంచ్ మాధవరావు పటేల్, మాజీ ఎంపీటీసీ పోశెట్టి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భీమ పవర్, భూమరెడ్డి, శంకర్ పటేల్, మాజీ సర్పంచ్ తులసి రామ్, హైమద్ మరియు తదితరులు ఉన్నారు.












