మిర్యాలగూడ, 2026-08-15
మిర్యాలగూడ పట్టణం, మండలంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు జాతీయ పతాకాలను ఆవిష్కరించి, దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన మహనీయులకు నివాళులర్పించారు.
మిర్యాలగూడ పట్టణం, మండలంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక హనుమాన్ పేట సీఎంఆర్ షాపింగ్ మాల్ వద్ద ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, పోలీస్ సబ్ డివిజన్ లో డిఎస్పి రవి, మునిసిపాలిటీలో చైర్మన్ చిలుకూరు సుధాబాలకృష్ణ, తహసిల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ పి. శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
వివిధ కార్యాలయాల్లో వేడుకలు
మండల పరిషత్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జె. వెంకట్ రెడ్డి, ఎంపిడిఓ ఎం. శేషగిరిశర్మ, డివిజనల్ పంచాయతీలో డిఎల్పిఓ రాఘవరావు, ఎన్ఎస్పీ డివిజన్ లో ఇఇ గోపినాధ్, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ రంగయ్య, వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ దీపా, ఐసిడిఎస్, మిర్యాలగూడ, దామరచర్ల కార్యాలయాల్లో ప్రాజెక్ట్ ఆఫీసర్లు వేణుగోపాల్, శాంతి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో
కాంగ్రెస్ కార్యాలయంలో ఒన్, టూ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు కె. ఇంద్రకుమార్, ఎండి. హామీదుద్దీన్ (మొయిజ్), విద్యుత్ ఉద్యోగుల సంఘంలో జిల్లా అధ్యక్షుడు జె. అమర్ కుమార్ రెడ్డి, కార్యదర్శి రాజేశ్వరరావు, బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.












