లోకేశ్వరం, 2026-06-05
లోకేశ్వరం: వేదం పాఠశాల లోకేశ్వరం లో బోనాల పండుగను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై, బోనాల పండుగ విశిష్టతను చాటుతూ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

సంస్కృతి, సంప్రదాయాల ప్రాధాన్యత
పాఠశాల ఆవరణలో భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు నిర్వహించి, విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ప్రాధాన్యతను వివరించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, బోనాల వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి.
అభినందనలు
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ దడిగే రమేష్, కరస్పాండెంట్ మల్లేష్, ఉపాధ్యాయులు గంజాయి పోశెట్టి, రవీందర్ తో పాటు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాలలో ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో మన సంప్రదాయాలు, సంస్కృతి పట్ల అవగాహన పెరుగుతుందని ప్రిన్సిపాల్ దడిగే రమేష్ తెలిపారు. బోనాల వేడుకలను విజయవంతంగా నిర్వహించిన ఉపాధ్యాయ బృందాన్ని పాఠశాల యాజమాన్యం అభినందించింది.