జిలకరకుంట తండా ఘనంగాతీజ్ పండగ సంబరాలు.. హాజరైన ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్
మిర్యాలగూడ జులై 30 (మనోరంజని తెలుగు టైమ్స్)
అడవిదేవులపల్లి
మండలం జిలకరకుంట తండాగ్రామపంచాయతీలో నిర్వహించిన తీజ్ పండుగ సంబరాల్లో తెలంగాణ శాసన మండలి సభ్యులు కేతావత్ శంకర్ నాయక్ హాజరైనారు. ఈ సందర్భంగా తండా మహిళలు సంప్రదాయ బంజారా వేషధారణలో తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించగా, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ శుభాకాంక్షలు తెలియజేసి వారి ఆనందంలో భాగస్వామ్యమయ్యారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హాము, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











