నిర్మల్, 6 September
మన చెరువులు మన హక్కులు అనే నినాదంతో హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ వద్ద తెలంగాణ గంగ తెప్పోత్సవ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గంగపుత్రుల తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో వేలాది మంది మత్స్యకారులు, మహిళలు పాల్గొన్నారు.
*ఘనంగా హైదరాబాద్లో తెలంగాణ గంగతెప్పోత్సవం* ( మనోరంజని తెలుగు టైమ్స్ జిల్లా ప్రతినిధి ) *మన చెరువులు మన హక్కులు అంటూ హుస్సేన్ సాగర్ లో హోరెత్తిన గంగపుత్రుల గర్జన* *2 వల గొడుగులు పోతారాజు విన్యాసాలు బోనాలతో హుస్సేన్ సాగర్లో గంగమ్మ తెప్పోత్సవం* *3 ఆత్మగౌరవ పోరాటానికి నిదర్శనంగా తెలంగాణ గంగ తెప్పోత్సవం విజయవంతం* *4 ఏడుగురు మాతల గుడి నుండి హుస్సేన్ సాగర్ వరకు బోనాలతో గంగపుత్రుల మహా పాదయాత్ర* హైదరాబాద్ తెలంగాణ గంగ తెప్పోత్సవ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు హుస్సేన్ సాగర్ వద్ద తెలంగాణ గంగ తెప్పోత్సవము అత్యంత ఘనంగా నిర్వహించబడిందిమన చెరువులు మన హక్కులు అనే నినాదంతో ఈ వేడుకను నిర్వహించారు గంగపుత్రుల జీవన హక్కుల పరిరక్షణ కోసం మరియు చెరువుల పరిరక్షణ కోసం ఈ ఉత్సవాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు కమిటీ తెలిపిందిఈ కార్యక్రమంలోభాగంగా నగరంలోని ఏడుగురు మాతల గుడి ఖైరతాబాద్ నుండి వందలాది మంది మహిళలు బోనాలతో వల గొడుగులు పట్టుకుని పోతారాజుల విన్యాసాలతో పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరారుఅక్కడి నుండి గంగమ్మ తల్లి మందిరం హుస్సేన్ సాగర్ లోని మైసమ్మ తల్లిగుడికి వెళ్లి బోనాలు సమర్పించారు అనంతరం హుస్సేన్ సాగర్ లో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి తెప్పోత్సవాన్ని ఘనంగా జరిపారుఈ సందర్భంగా గంగపుత్ర సంఘం నాయకులు చైతన్య సమితి అధ్యక్షుడు మంగిలి పల్లి శంకర్ మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న అన్ని చెరువులు కుంటలపై మా హక్కును కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చెరువులను కబ్జాల నుండి కాపాడాలని మత్స్యకారులకు ఉపాధి భద్రత కల్పించాలనికోరారుఈకార్యక్రమంలోరాష్ట్రనలుమూలల నుండి వేలాది మంది గంగపుత్రులు మత్స్యకారులు మహిళలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారుఇది కేవలం పండుగ మాత్రమే కాదు మా ఆత్మగౌరవానికి చిహ్నం అని నిర్వాహకులు పేర్కొన్నారుఈ కార్యక్రమానికి జిల్లా నుండి అర్బన్ రూరల్ కు సంబంధించి న అధ్యక్షులు సెక్రటరీ లు సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు










