గంగారం తండా, మహేశ్వరం, రంగారెడ్డి, తెలంగాణ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 03
గంగారం గ్రామపంచాయతీ పరిధిలోని గంగారం తండాలో నేనావత్ సోనీభాయ్ నిర్మించుకున్న ఇంద్రమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులు రిబ్బన్ కట్ చేసి నూతన గృహాన్ని ప్రారంభించారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చేపడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ దేవేందర్ నాయక్ సూచించారు.
ఇంద్రమ్మ ఇంట్లో గృహప్రవేశం పేదల సొంతింటి కల నెరవేరుతోంది: సర్పంచ్ దేవేందర్ నాయక్ గంగారం, సెప్టెంబరు 3 ( గంగారం గ్రామపంచాయతీ పరిధిలోని గంగారం తండాలో నేనావత్ సోనీభాయ్ నిర్మించుకున్న ఇంద్రమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులు రిబ్బన్ కట్ చేసి నూతన గృహాన్ని ప్రారంభించారు. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని గంగారం గ్రామపంచాయతీకి ఇంద్రమ్మ ఇళ్ల కింద అధిక సంఖ్యలో ఇళ్లు మంజూరు కావడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని సర్పంచ్ దేవేందర్ నాయక్ తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంద్రమ్మ ఇళ్ల పథకం ద్వారా తమ గ్రామానికి ఎక్కువ ఇళ్లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, కేఎల్ఆర్కు గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మహేందర్, గ్రామపంచాయతీ కార్యదర్శి మహేష్, వార్డు సభ్యులు ముణాత్, రవి నాయక్, మోహన్, జ్యోతి, గోపి, రజిత, శ్రీనివాస్, లావణ్య, పద్మ, దేవా, ధర్మ, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.











