ఖానాపూర్, 3 September
మండలంలోని దిలావర్పూర్ గ్రామపంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పంపిణీ చేసిన రేషన్ స్మార్ట్ కార్డులను గురువారం లబ్ధిదారులకు అందజేశారు. సర్పంచ్ చింతల మల్లేష్, డీలర్ నర్సయ్య ఈ కార్డులను పంపిణీ చేశారు.
దిలావర్పూర్ గ్రామపంచాయతీలో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ. సెప్టెంబర్ ( మనోరంజని తెలుగు టైమ్స్)రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పంపిణీ చేసిన రేషన్ స్మార్ట్ కార్డులను గురువారం మండలంలోని దిలావర్పూర్ గ్రామపంచాయతీ లో సర్పంచ్ చింతల మల్లేష్ మరియు డీలర్ నర్సయ్య లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కార్డులను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని అన్నారు. ప్రతి నెల రేషన్ కొరకు వెళ్ళినప్పుడు స్మార్ట్ కార్డులను తమ వెంట తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చింతల మల్లేష్, ఉప సర్పంచ్ ఓరగంటి రాజేశ్వర్, డీలర్ నర్సయ్య, అంగన్వాడి కార్యకర్త సత్యవ్వ, ఆశా వర్కర్ మీనుగు కమల, వార్డు మెంబర్లు, కారోబార్ పోశెట్టి, లబ్ధిదారులు పాల్గొన్నారు











