దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, ప్రధానమంత్రికి మద్దతుగా నిర్మల్ జిల్లాకు చెందిన ఓ యువకుడు చేపట్టిన మూడు రోజుల సైకిల్ యాత్రకు స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
పెంచికల్ పాడ్ గ్రామానికి చెందిన సాయి సూర్యవంశీ, బీజేపీ మండల కార్యదర్శి, పెంచికల్ పాడ్ నుంచి మహిష వరకు ఈ యాత్రను ప్రారంభించారు. యాత్ర తొలి రోజు విజయవంతంగా పూర్తయింది.
దేశాభివృద్ధి, యువతలో చైతన్యం, మరియు జాతీయ భావన పెంపొందించాలనే లక్ష్యంతో ఈ సైకిల్ యాత్రను చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. మార్గమధ్యంలో పలువురు గ్రామస్తులు యాత్రికుడిని అభినందించి మద్దతు తెలిపారు.
యాత్ర రెండో రోజు కార్యక్రమం మంగళవారం కొనసాగనుంది. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రోత్సహించాలని నిర్వాహకులు కోరారు.
ఈ సందర్భంగా యాత్రికుడు మాట్లాడుతూ, దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని, యువత దేశం కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.








