బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో, మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు ఒక మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు.
కన్నెలూరు ప్రాంతానికి చెందిన చంద్రాయుడు అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు బంధువులు ముందుకు రాలేదు. దీంతో స్థానికులు మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ అధ్యక్షుడు అహమ్మద్ హుస్సేన్‌ను సంప్రదించారు.
సమాచారం అందుకున్న ఫౌండేషన్ సభ్యులు వెంటనే స్పందించి, శనివారం హిందూ స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సేవా కార్యక్రమానికి సహకరించిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్‌రావు, టౌన్ అధ్యక్షుడు అహమ్మద్ హుస్సేన్, సభ్యులు సుభాన్, అశోక్ కుమార్, భార్గవ్ సాయి, ముని సాయి తదితరులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీ అమ్మ శరణాలయంలోని వృద్ధులకు సహాయం చేయదలచిన దాతలు 82972 53484, 9182244150 నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.











