చించొలి(బి) (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 08
మండలంలోని చించొలి(బి) గ్రామంలో గ్రామ భద్రతను మెరుగుపరిచేందుకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్మల్ రూరల్ సీఐ ఎం. కృష్ణ గ్రామస్తులకు సూచించారు. వనమహోత్సవంలో భాగంగా అధికారులు, గ్రామస్తులు కలిసి మొక్కలు నాటారు.
మండలంలోని చించొలి(బి) గ్రామంలో గ్రామస్తులతో నిర్మల్ రూరల్ సీఐ ఎం. కృష్ణ బుధవారం సమావేశం నిర్వహించారు. గ్రామ భద్రతకు సీసీటీవీ కెమెరాలు అత్యంత అవసరమని, ప్రతి దుకాణం, వ్యాపార సంస్థ, ప్రధాన కూడళ్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.
గ్రామంలో నేరాల నివారణ, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులతో సమన్వయంగా పనిచేయాలని సీఐ కోరారు. దీనికి స్పందించిన గ్రామ సర్పంచ్ సాయన్న, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామంలో త్వరలోనే సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
అనంతరం వనమహోత్సవంలో భాగంగా గ్రామంలోని అరె మైసమ్మ దేవాలయం ఆవరణలో గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో సారంగాపూర్ ఎస్ఐ శ్రీకాంత్, గ్రామ సర్పంచ్ సాయన్న, ఉప సర్పంచ్ పోశెట్టి, గ్రామ పంచాయతీ కార్యదర్శి సౌజన్య, గ్రామస్తులు పాల్గొన్నారు.











