భైంసా, 1 August
భైంసా పట్టణంలో ప్రముఖ సమాజ సంస్కర్త, సాహిత్యరత్న డాక్టర్ అన్నభావు సాఠే గారి 106వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి, శ్రామిక వర్గ హక్కుల సాధనకు సాఠే చేసిన కృషిని కొనియాడారు.
భైంసా పట్టణంలో ప్రముఖ సమాజ సంస్కర్త, సాహిత్యరత్న డాక్టర్ అన్నభావు సాఠే గారి 106వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన అన్నభావు సాఠే గారి విగ్రహానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ లోలం శ్యాంసుందర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాజీ జడ్పీ ఛైర్మన్ లోలం శ్యాంసుందర్ మాట్లాడుతూ... సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, శ్రామిక వర్గం హక్కుల సాధనకు డాక్టర్ అన్నభావు సాఠే చేసిన కృషి అనితరసాధ్యమైనదని కొనియాడారు. తన సాహిత్యం, ఆలోచనలతో సమాజంలో గొప్ప చైతన్యాన్ని నింపారని, ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.












