ఆర్మూర్, జూలై 18
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతేపూర్ గ్రామంలో ఇందుర్ పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా అవగాహన కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో హోంగార్డ్ కళాబృందం గాయని సీత సామాజిక చైతన్యాన్ని పెంపొందించే పాటలు ఆలపించి ప్రశంసలు అందుకున్నారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతేపూర్ గ్రామంలో ఇందుర్ పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా అవగాహన కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో హోంగార్డ్ కళాబృందం గాయని సీత సామాజిక చైతన్యాన్ని పెంపొందించే పాటలను ఆలపించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఆమె గానాన్ని మెచ్చుకున్న గ్రామ మహిళలు సంప్రదాయబద్ధంగా చీర–సారెతో సన్మానించి అభినందనలు తెలిపారు.
సన్మానం అనంతరం సీత మాట్లాడుతూ, తన కళను ఆదరించి గౌరవించిన గ్రామ మహిళలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా అవగాహన కార్యక్రమాల్లో భాగస్వామిగా సమాజానికి సేవ చేసే అవకాశం దక్కడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు.










