
ముధోల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిధి అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. పీజీలో 55% మార్కులతో పాటు నెట్, సెట్, పీహెచ్డీ అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ కర్రోళ్ల బుచ్చయ్య తెలిపారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు స్వీకరించి, 23న భైంసా కళాశాలలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.


















