
రామడుగు మండలంలో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా మండల సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. మండల పరిషత్ సమావేశ మందిరంలో ప్రత్యేక అధికారి ఎం. అనిల్ ప్రకాష్ కిరణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచులు పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.



















