
దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో తన 20 ఏళ్ల వాణిజ్య కార్యకలాపాల మైలురాయిని పురస్కరించుకుని ప్రయాణికులకు భారీ ఆఫర్ను ప్రకటించింది. ఇండిగో ఫ్రీ పేరుతో 20,000 ఉచిత టికెట్లను అందించడంతో పాటు, అర్హులైన వారికి రూ.10,000 వరకు రీఫండ్ కూడా ఇవ్వనుంది.

దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో తన 20 ఏళ్ల వాణిజ్య కార్యకలాపాల మైలురాయిని పురస్కరించుకుని ప్రయాణికులకు భారీ ఆఫర్ను ప్రకటించింది. ఇండిగో ఫ్రీ పేరుతో 20,000 ఉచిత టికెట్లను అందించడంతో పాటు, అర్హులైన వారికి రూ.10,000 వరకు రీఫండ్ కూడా ఇవ్వనుంది.

వివిధ కమిషనరేట్ల పరిధిలో ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్జిల్లా నేరస్థులతో పాటు ఒక చోరీ సొత్తు గ్రహీతను జూబ్లీహిల్స్ జోన్ టాస్క్ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ. 12 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, వాహనాలు, నేర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెల్ల రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 15 నుంచి అర్హులైన నిరుపేదలకు 1.05 కోట్ల కొత్త రేషన్ కార్డులను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

మగ్గం మోగితే మన సంస్కృతి మేల్కొంటుంది, కానీ ఆ ఇంట్లో నవ్వులు మోగడం లేదు. నూలు కదిలితే నవభారత కీర్తి ముందుకు సాగుతోంది, కానీ ఆ కుటుంబం బతుకు ముందుకు సాగడం లేదు. చెమటను అద్భుత డిజైన్లతో చీరలో మలిచిన నేతన్న, కన్నీటిని కనురెప్పల మాటున దాచుకుంటున్నాడు.

మణుగూరు ప్రభుత్వ ఐటీఐ/ఏటీసీలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన రెండో విడత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 6 నుంచి 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ముధోల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాపేవార్ కిష్టయ్య ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయ సాగును ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి తెలిపారు. రైతులు పంట మార్పిడి విధానాలను పాటించేలా విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు ఆయన సూచించారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి ఈ అంశాలపై సమీక్ష నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కాగిత రహిత విధానంలో భాగంగా, నిర్మల్ జిల్లాలో ఆగస్టు 15, 2026 నుంచి ఐఎఫ్ఎంఎస్ () ద్వారా పేపర్లెస్ బిల్లుల సమర్పణ విధానాన్ని అమలు చేయనున్నట్లు జిల్లా ఖజానా అధికారి సరోజ తెలిపారు. ఈ మేరకు ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

కమ్మర్పల్లి గ్రామానికి చెందిన టేకు కృష్ణ ప్రసాద్ (15) అనే బాలుడు గురువారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు. వెంటనే కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కమ్మర్పల్లి సబ్ ఇన్స్పెక్టర్ సిహెచ్. సతీష్, సిబ్బందితో కలిసి వెంటనే విచారణ చేపట్టారు.

కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. తనను నాన్-లోకల్ అంటూ చేస్తున్న విమర్శలపై డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క తీవ్రంగా స్పందించారు. ఇది రాజకీయ దివాళాకోరుతనం అని, తాను ఈ నేలపై పుట్టి పెరిగిన ఆదివాసి బిడ్డనని ఆమె స్పష్టం చేశారు.

చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పలువురు లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాద్ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను, రైతు భీమా ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు.

రామడుగు మండలం వేదిర గ్రామంలో మైత్రి గ్రూప్ ఆఫ్ చైర్మన్ డాక్టర్ కొత్త జైపాల్ రెడ్డి వివాహ వార్షికోత్సవం సందర్భంగా యువశక్తి యూత్ క్రీడాకారులకు వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా రెడ్డి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భీరెడ్డి కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.

రామడుగు మండలంలో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా మండల సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. మండల పరిషత్ సమావేశ మందిరంలో ప్రత్యేక అధికారి ఎం. అనిల్ ప్రకాష్ కిరణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచులు పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.

రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని వ్యవసాయ రంగ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎం. కోదండరెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో గురువారం జరిగిన కన్సల్టేటివ్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని బైంసాలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనకు పలువురు నాయకులు నివాళులర్పించారు.

ప్రొద్దుటూరును ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చడమే లక్ష్యమని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. ప్లాస్టిక్ వాడకం వలన కలిగే నష్టాలను ప్రజలకు వివరించి, దాని వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని ఆయన పిలుపునిచ్చారు.

భీంగల్ పట్టణంలో జరిగిన ఊర పండుగను తమ యూట్యూబ్ ఛానళ్ల ద్వారా అద్భుతంగా చిత్రీకరించి, ప్రజల్లోకి తీసుకెళ్లిన పలువురు క్రియేటర్లకు భీంగల్ పట్టణ సర్వసమాజ్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. గురువారం సంఘ భవనంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, ప్రజా యుద్ధనౌక గద్దర్ లకు గురువారం మిర్యాలగూడలోని గ్రంథాలయం, శాంతినికేతన్ డిగ్రీ కళాశాలలో ఘనంగా నివాళులు అర్పించారు.

మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ నాయకులు, బిఎల్ఆర్ బ్రదర్ గుంటూరు చంద్రశేఖర్ పుట్టినరోజు వేడుకలు గురువారం పట్టణంలోని రా రా కేఫ్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) హాజరై, చంద్రశేఖర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

మే ఐ హెల్ప్ పౌండేషన్ ఆధ్వర్యంలో అంతక్రియలు