
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల వ్యవస్థలో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ సర్టిఫికెట్లతో జూనియర్ లెక్చరర్లుగా ఉద్యోగాలు పొందిన 37 మందికి ఇంటర్మీడియట్ బోర్డు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు, ఒకే ఆధారంతో రెండు వేర్వేరు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులుగా నమోదై, రెండు చోట్ల నుంచి అక్రమంగా జీతాలు పొందుతున్న 40 మందిని అధికారులు గుర్తించారు.



















