
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో విజయ డైరీ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. చట్టబద్ధంగా ఎన్నికైన విజయ డైరీ చైర్మన్‌ను ఇద్దరు మంత్రులు బెదిరించి రాజీనామా చేయించారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఇది విజయ డైరీని హెరిటేజ్‌కు అప్పగించే కుట్రేనని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.



















