
రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ పనితీరు కనబరిచి మొదటి స్థానం సాధించిన నిర్మల్ జిల్లా షీ టీమ్ సభ్యులను జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ అభినందించారు. ఈ విజయం జిల్లా పోలీసు శాఖకు గర్వకారణమని ఆమె పేర్కొన్నారు.

రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ పనితీరు కనబరిచి మొదటి స్థానం సాధించిన నిర్మల్ జిల్లా షీ టీమ్ సభ్యులను జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ అభినందించారు. ఈ విజయం జిల్లా పోలీసు శాఖకు గర్వకారణమని ఆమె పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా, ఆర్మూర్ మండలంలో ఓటర్లకు సరైన అవగాహన కల్పించకుండానే దరఖాస్తుల పంపిణీ జరుగుతోందని ఓటర్లు ఆరోపిస్తున్నారు. ఈ నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుంటొల్ల వెంకటస్వామి పిలుపు మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ నెల 29న హైదరాబాద్‌లోని ఐ అండ్ పీఆర్ కమిషనర్ కార్యాలయం ముట్టడికి దళిత గిరిజన జర్నలిస్టులు, సామాజిక వాదులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అతలాంటిక్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం తాడెం గ్రామ మాజీ సర్పంచ్ భాస్కర్ రెడ్డి కుమార్తె, కుప్పన్పల్లి గ్రామానికి చెందిన సాయి రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు హాజరయ్యారు.

రాష్ట్రంలో అక్రిడిటేషన్ల జారీలో దళిత, గిరిజన జర్నలిస్టులపై వివక్ష చూపుతూ, కుల వివక్షతో కూడిన అన్యాయం జరుగుతోందని తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుంటోల్ల వెంకటస్వామి ఆరోపించారు. ఈ నెల 29న హైదరాబాద్ లోని ఐ అండ్ పీఆర్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించే 'చలో హైదరాబాద్' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

స్పెషల్ ఇంటెన్సివ్ రేవిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా అందిస్తున్న ఫారాలను జాగ్రత్తగా నింపాలని కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి కోరారు. శనివారం 5వ వార్డులో ఎస్ఐఆర్ ఫారాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

మిర్యాలగూడ మండల వ్యవసాయ అధికారి మేకల ఋష్యేంద్రమణి శనివారం పట్టణంలోని పలు విత్తనాల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుమిత్ర, చీదళ్ల అనంతరాములు అండ్ సన్స్, యొద సీడ్స్ షాపుల్లో వరి విత్తనాలను పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన 7 రకాల విత్తనాలున్నాయని ఆమె తెలిపారు.

బైంసా: ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ గన్నోరా, కోతుల్ గాం గ్రామ సర్పంచ్ లకు రూ. 95 లక్షల అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. గన్నోరాలో గోదాం నిర్మాణానికి రూ. 30 లక్షలు, కోతుల్ గాంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 20 లక్షలు, వంతెన నిర్మాణానికి రూ. 45 లక్షలు మంజూరు చేశారు.

సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా పూరించిన గణన ఫారాలను గడువులోగా బీఎల్ఓలకు అందజేయని ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని కుంటాల తహసీల్దార్ ఆడే కమల్‌సింగ్ హెచ్చరించారు.

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన రచ్చ మురళికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా హాజరైన నిజామాబాద్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు, రచ్చ మురళిని అభినందించారు. ఆయన విద్యార్థులకు అక్షర జ్ఞానాన్ని అందించి, ఉన్నత శిఖరాలకు చేర్చిన ఆదర్శ ఉపాధ్యాయుడని కొనియాడారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామంలోని శ్రీ పోచమ్మ తల్లి ఆలయంలో శనివారం పాత విగ్రహాన్ని శాస్త్రోక్తంగా తొలగించారు. గ్రామ సర్పంచ్ ఏనుగుల కనకయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలను జూలై 3 నుంచి 5 వరకు నిర్వహించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా, ఆర్మూర్ మండలంలో ఓటర్లకు సరైన అవగాహన కల్పించకుండానే దరఖాస్తులు పంపిణీ చేస్తున్నారని స్థానిక ఓటర్లు ఆరోపించారు. బూత్ స్థాయి అధికారులు దరఖాస్తులను ఓటర్లే నింపుకోవాలని సూచిస్తున్నారని, దీంతో చాలామంది అయోమయానికి గురవుతున్నారని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు సరైన అవగాహన కల్పించకుండా దరఖాస్తుల పంపిణీ చేస్తున్నారని ఆర్మూర్ మండలంలోని పలువురు ఓటర్లు ఆరోపిస్తున్నారు.

భైంసాలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పిలుపునిచ్చారు. ఈ నెల 28న జరగనున్న ఈ కార్యక్రమంలో 5 ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన తల్లిదండ్రులకు సూచించారు.

వేల్పూర్ శివారులో గల శ్రీ సాయిబాబా దేవాలయ ప్రాంగణంలోని పంచవటి (మర్రి వృక్షం) క్రింద శ్రీ దత్తాత్రేయుని స్థానంలో నిజ జ్యేష్ఠ మాసం పౌర్ణమి అయిన జూన్ 29 సోమవారం రోజున "వటసావిత్రి వ్రతం" ఘనంగా నిర్వహించనున్నట్లు కార్యక్రమ ప్రచార ప్రతినిధి కొండ అశోక్ గౌడ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే బహుజనుల గొంతుక డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జేఏసీ కాంట్రాక్ట్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి కొంకటి శేఖర్ ఆరోపించారు. కరీంనగర్ బస్టాండ్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాబోయే వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి ఆధ్వర్యంలో శనివారం దివ్య నగర్ కాలనీలో మురికి కాలువలు, నాళాల పూడిక తీత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వర్షపు నీరు సాఫీగా ప్రవహించేలా చర్యలు తీసుకుంటున్నారు.

నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్స్‌లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై అవగాహన సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

డాక్టర్ కావేరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుంట ఆరాధ్య 12వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ కుంట రమనేశ్వర్–స్రవంతి దంపతులు పేద విద్యార్థులకు సుమారు రూ.3 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. గత ఐదేళ్లుగా తమ కుమార్తె జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తూ, విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు.

నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కౌడగాని వెంకటేష్ ఆధ్వర్యంలో సిరిసిల్ల బ్రిడ్జిపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.