
కుబీర్ మండలంలోని సేవాదాస్ నగర్ కు చెందిన ఐటీ అధికారి, సామాజిక సేవకుడు రాథోడ్ ప్రకాష్ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అభిమానులు బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచుకున్నారు. రాథోడ్ ప్రకాష్ పేద ప్రజలకు అండగా నిలుస్తూ, అవసరమైన వారికి సహాయం అందిస్తున్నారని పలువురు కొనియాడారు.

















