
కుబీర్ మండలంలోని కుప్టి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేస్తోందని అన్నారు. లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయడమే కాకుండా, నిర్మాణానికి అవసరమైన నిధులను సకాలంలో అందిస్తున్నామని తెలిపారు.



















