
దనపనవైనషఢృఎోపననద.ఈోఅనేపడుుఉవుుోటుేుుట.అవనునుఇదఅశేషఠైనపణబడుుద.

దనపనవైనషఢృఎోపననద.ఈోఅనేపడుుఉవుుోటుేుుట.అవనునుఇదఅశేషఠైనపణబడుుద.

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ గడువును కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) పొడిగించింది. ఈ మేరకు బుధవారం సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో బీఎల్ఓల ఇంటింటి సర్వేకు ఆగస్టు 3 వరకు అవకాశం లభించింది.

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలోని పరికిబండలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ నుంచి కమర్షియల్ సిలిండర్‌లోకి గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు బీహార్‌కు చెందిన వలస కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రతా విభాగంలో గన్‌మెన్‌గా పనిచేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ కిరణ్ రోడ్డు ప్రమాదంలో మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించిన కిరణ్ అకాల మరణం పోలీస్ వర్గాల్లో, సహచరుల్లో దిగ్భ్రాంతిని కలిగించింది.

సైబర్ నేరాల్లో డబ్బులు కోల్పోయిన బాధితులకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) 'మనీ రిస్టోరేషన్ మాడ్యూల్' (Money Restoration Module)ను అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానం ద్వారా బాధితులు తమ నిధులను సులభంగా తిరిగి పొందే అవకాశం ఉందని బ్యూరో డైరెక్టర్ శిఖా గోయెల్ తెలిపారు. అర్హులైన బాధితుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ కానున్నాయి.

నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోతన్న యాదవ్, ముధోల్ లో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్యశాల పనులను తక్షణమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. రూ.8 కోట్ల వ్యయంతో 30 పడకల వైద్యశాల నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన జరిగినప్పటికీ, పనులు పూర్తికాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు.

డిల్లీలో జిల్లాలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) మంత్రినిని తక్షణమే పునరుద్ధరించాలని కోరుతూ ఫ్యాక్టరీ పార్టీ బృందం ఆదిలాబాద్ భారీ పరిశ్రమలు & ఉక్కు శాఖ మంత్రి శ్రీ హెచ్.డి. కుమారస్వామికి న్యూఢిల్లీలో పునరుద్ధరణపై వినతిపత్రం సమర్పించిన బీఆర్ఎస్ బృందం.పత్రం సమర్పించింది. ఫ్యాక్టరీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే.టి. రామారావు ఈ బృందానికి నాయకత్వం వహించారు.

అడవిదేవులపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు భారత్ పెట్రోలియం సంస్థ రూ. 51 వేల విలువైన కూల్ వాటర్ ప్లాంట్‌ను అందించింది. ఈ సందర్భంగా మండల విద్యాధికారి రమావత్ వరలక్ష్మి సంస్థను అభినందించారు. పాఠశాల అభివృద్ధికి ఇలాంటి సహకారం ఎంతో అవసరమని ఆమె అన్నారు.

ఆర్మూర్ లోని సహస్రార్జున ఆత్మీయ మిత్రమండలి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన క్షత్రియ సమాజ్ (ఎస్.ఎస్.కే) అధ్యక్షులు గటడి ఆనంద్, కార్యదర్శి డీకే రాజేష్ లకు ఘనంగా సన్మానం జరిగింది. మిత్రమండలి సభ్యులు వారికి పూలమాలలు, శాలువా, మెమొంటోలను అందజేసి అభినందించారు.

మిర్యాలగూడ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ (యూజీడీ) పనుల సమస్యలను కౌన్సిలర్ నూకల కవిత వేణుగోపాల్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీసీ రోడ్లను ధ్వంసం చేయకుండా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే బిఎల్ఆర్ దృష్టికి తీసుకెళ్లగా, ఎస్టీపీ-2 ప్లాంటును త్వరగా అందుబాటులోకి తీసుకొస్తామని హామీ లభించింది.

మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజారెడ్డి శనివారం సీతారాంపూర్ లోని 75 పోలింగ్ స్టేషన్ ను సందర్శించి ఎస్ఐఆర్(సర్) పనులను పరిశీలించారు. ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరుతో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఉచిత ఇసుక విధానాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు, అక్రమార్కులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనిపై అధికారులు సరైన నిఘా పెట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి.

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గురువారం నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో, జిల్లా ప్రజలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు, అట్రాసిటీ కేసుల బాధితులు తమ సమస్యలను నేరుగా కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని జిల్లా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు బత్తుల రంజిత్ కోరారు.

నిర్మల్ నియోజకవర్గం మామడ మండల కేంద్రంలో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూ.30 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ (అగ్రికల్చర్ గోదాం) భవన నిర్మాణానికి బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఈ గోదాం నిర్మాణం పూర్తయిన అనంతరం రైతులకు ధాన్యం నిల్వలో సౌలభ్యం కలుగుతుందని తెలిపారు.

సారంగాపూర్ మండలంలో తాటి, ఈత చెట్లను నరికిన కుమ్మరి నరసయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సారంగాపూర్ మండల గౌడ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. రాజకీయ అండదండలతో సుమారు 50 చెట్లను నరికించిన నరసయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్రవ్యాప్తంగా 23 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త బాధ్యులను నియమించింది. బోథ్ అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యులుగా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావును పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నియమించారు.

నిర్మల్ పట్టణంలో దారుణ హత్య కలకలం రేపింది. వైఎస్సార్ కాలనీ సమీపంలో ఆటో డ్రైవర్ అస్లాం (23)పై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం గడువును ఎన్నికల సంఘం పొడిగించింది. ఈ నెల 24తో ముగియనున్న గడువును ఆగస్టు 3 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది. ఓటరు నమోదు, వివరాల సవరణ, మార్పులు, తొలగింపులకు సంబంధించి ప్రజలకు మరింత అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ దరఖాస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం భైంసా, నిర్మల్ పట్టణాల్లో ఆయన ఓటరు సవరణ కార్యక్రమాల అమలును పరిశీలించారు.

నిమలజిలలాకుచందిన16మందివిదయాథులుగిననిసపపంచికాుసాధించంజిలలాకుగవకాణమనిభాతీయజనతాపాటీశాసనసభాపకషనేత,నిమలఎమమలయేఏలేటిమహేశవిఅననాు.హైదాబాదలోనిగచచిబౌలిలోఏపిల26నజిగినకాటేపదశనలోవీుికాునలకొలపాు.