
సారంగాపూర్ మండలంలోని జాం గ్రామ ఉపసర్పంచ్ బింగి గంగాధర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.



















