
ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ దరఖాస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం భైంసా, నిర్మల్ పట్టణాల్లో ఆయన ఓటరు సవరణ కార్యక్రమాల అమలును పరిశీలించారు.

ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ దరఖాస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం భైంసా, నిర్మల్ పట్టణాల్లో ఆయన ఓటరు సవరణ కార్యక్రమాల అమలును పరిశీలించారు.

నిమలజిలలాకుచందిన16మందివిదయాథులుగిననిసపపంచికాుసాధించంజిలలాకుగవకాణమనిభాతీయజనతాపాటీశాసనసభాపకషనేత,నిమలఎమమలయేఏలేటిమహేశవిఅననాు.హైదాబాదలోనిగచచిబౌలిలోఏపిల26నజిగినకాటేపదశనలోవీుికాునలకొలపాు.

బోథ్ నియోజకవర్గంలోని సోనాల మండలంలో తెలంగాణ ప్రజా పాఠశాల ఏర్పాటు చేయాలని కోరుతూ మండల వాసులు బుధవారం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల లేని ఏకైక మండలం సోనాలేనని, దీంతో విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని వారు తెలిపారు.

ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం సొనాల మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటించి, పలు ప్రభుత్వ కార్యాలయాలు, అభివృద్ధి పనులను పరిశీలించారు. గ్రామ అభివృద్ధికి సంబంధించిన సమస్యలను స్థానిక ప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించి, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

బాసర రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఐఐఐటి)లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. క్యాంపస్లో నిరంతర విద్యుత్, సురక్షిత త్రాగునీరు, పరిశుభ్రత, నాణ్యమైన భోజనం అందించడంలో రాజీ పడకూడదని ఆయన స్పష్టం చేశారు.

జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో 'పోలీసులు మీకోసం' కార్యక్రమంలో భాగంగా యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు, పోలీసు-ప్రజల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేసేందుకు మండల స్థాయి వాలీబాల్ పోటీలు బోథ్ మండల కేంద్రంలో బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ ఆదేశాల మేరకు బోథ్ సీఐ డి. గురుస్వామి ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు.

తానూర్ మండలంలో ఇటీవల మృతి చెందిన కోలూర్ గ్రామవాసుల కుటుంబాలను, బోరెగాం గ్రామ సర్పంచ్ పల్లె జ్యోతి కుటుంబసభ్యులను ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పరామర్శించారు. అనారోగ్యంతో శస్త్రచికిత్స చేయించుకున్న పలువురిని కూడా కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

నిర్మల్ నియోజకవర్గం మామడ మండల కేంద్రంలో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూ.30 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ (అగ్రికల్చర్ గోదాం) భవన నిర్మాణానికి బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ గోదాం నిర్మాణం పూర్తయితే రైతులకు ధాన్యం నిల్వలో సౌలభ్యం కలుగుతుందని ఆయన తెలిపారు.

ఉరి వేసుకొని వృద్దుడు మృతి.

నిజామాబాద్ జిల్లా మెండోర మండలం చాకిర్యాల్ గ్రామ పరిధిలోని సోన్ వంతెనపై అప్పుల బాధతో ఓ యువకుడు గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం జరిగిన ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

జూలై 25, 26 తేదీలలో నిర్మల్ జిల్లాలో జరగనున్న తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం (టి.జి.ఏ.ఎస్) రెండవ మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి తొడసం శంభు పిలుపునిచ్చారు. ఈ మహాసభలు ఆదివాసుల హక్కులు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కీలకమని ఆయన అన్నారు.

తానూర్ మండలంలోని జవ్లా-బి, కోలూర్ గ్రామాల్లో నూతన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలను ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ బుధవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు.

నిర్మల్ జిల్లా సారంగాపూర్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని మార్చాలని మండల కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి తమ మనోభావాలను వెల్లడించారు. పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. కొత్తగా నియమించిన అధ్యక్షుడిపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ముధోల్ మండల కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కిష్టయ్య, రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. బుధవారం మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ముధోల్ నియోజకవర్గంతో పాటు పరిసర గ్రామాల్లో గత 15-20 రోజులుగా వర్షం జాడలు లేకపోవడంతో పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు వేసి, వరుణుడి కోసం ఆకాశం వైపు చూస్తున్నారు.

కుంటాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా లింబా (కే) గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఆనందరావు పాటిల్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ షిందే ఆనందరావు పాటిల్ ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం అందుకున్నారు.

ముధోల్ నియోజకవర్గంలో వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ దొంగతనం కలకలం సృష్టించింది. రెండు రోజుల క్రితం దొంగిలించబడిన ట్రాన్స్ఫార్మర్ను అధికారులు ఇంకా ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో విద్యుత్ సరఫరా లేకపోతే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మెండోరా మండలంలోని దూదగాం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వన మహోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ హరోను రషీద్ బాబా ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు మొక్కలు నాటడమే కాకుండా, వాటిని సంరక్షించే బాధ్యతను స్వీకరించారు.

నిర్మల్ జిల్లా బాసరలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విస్మరిస్తున్నారని బాసర మండల జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే పలుమార్లు ఇళ్ల స్థలాలు కేటాయించినా, బాసరలో మాత్రం ఇప్పటివరకు ఒక్కసారి కూడా కేటాయించలేదని వారు పేర్కొన్నారు.

సోనాల మండల కేంద్రంలోని ఓ వైన్ షాపులో బుధవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. షట్టర్లను ధ్వంసం చేసి, సీసీ కెమెరాలను పగలగొట్టి సుమారు రూ.1.5 లక్షల విలువైన మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లినట్లు నిర్వాహకులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.