
నిర్మల్ జిల్లా పెంబి మండలం చాకిరేవు గ్రామస్తులు సోలార్ ప్లాంట్ పనుల విషయంలో జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రాను కలిసి తమ సమస్యను వివరించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు పనులు ప్రారంభించకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేశారు.

నిర్మల్ జిల్లా పెంబి మండలం చాకిరేవు గ్రామస్తులు సోలార్ ప్లాంట్ పనుల విషయంలో జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రాను కలిసి తమ సమస్యను వివరించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు పనులు ప్రారంభించకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఖానాపూర్ానాపూర పటటణంలో అసంపూరతిగా నిలిచిపోయిన పరధాన రోడడు విసతరణ పనులను వెంటనే చేపటటాలని కోరుతూ సథానికులు మునసిపల చైర పరసన అంకం మౌనికకు సోమవారం వినతిపతరం సమరపించారు. రోడడు పనులకు ఆటంకంగా ఉనన విదయుత సతంభాలను తొలగించి, పనులు వేగవంతం చేయాలని వారు విజఞపతి చేశారు.

వర్షాభావ పరిస్థితుల కారణంగా తెలంగాణలో వ్యవసాయ సంక్షోభం ఏర్పడిందని, రైతులను ఆదుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నీట్ పేపర్ లీక్‌పై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని, బాధ్యులైన కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళిత, గిరిజనులపై దాడులు, హత్యలు, హత్య రాజకీయాలకు శ్రీకారం చుట్టిందని కావలి నియోజకవర్గం ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఆరోపించారు. కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హత్య రాజకీయాలు చేయిస్తున్నారని విమర్శలు గుప్పించారు. టిడిపి కార్యకర్త చాట్ల వాసు హత్యకు ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరుడే కారణమని ఆరోపించారు.

ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని నిపుణుల కమిటీ చైర్మన్ జి.చిన్నారెడ్డి తెలిపారు. ఈ నెల 22న ప్రజాభవన్‌లో నిపుణుల కమిటీ తొలి సమావేశం జరగనుంది.

భారత క్రికెట్ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్, డీఎస్పీ మహమ్మద్ సిరాజ్ తన డ్యూటీని ప్రారంభించారు. హైదరాబాద్ డీజీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన సందడి చేశారు. డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. దాదాపు గంటకు పైగా అక్కడే గడిపిన ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

బాసర మండలంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష తెలంగాణ ఆధ్వర్యంలో మూడు రోజుల శిక్షణా కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మండల విద్యాధికారి జి. మైసాజీ మాట్లాడుతూ, ఆధునిక బోధనా పద్ధతులను తరగతి గదిలో అమలు చేసి విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరచాలని సూచించారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్న భారీ వర్షాలు కురిశాయి. తిర్యాణిలో అర్ధరాత్రి కుండపోత వాన కురిసిన నేపథ్యంలో వాగులు, వంకలు ఉప్పొంగాయి. పలు గ్రామాలకు వెళ్లే మార్గమధ్యంలో ఉన్న లో-లెవెల్ వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. పరిస్థితిని అంచనా వేసిన అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.

నిర్మల్ జిల్లాలో బోడ కాకర కాయకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. భైంసా సోమవారం మార్కెట్లో కిలో రూ.400 ధర పలికింది. ఆరోగ్య ప్రయోజనాలు, షుగర్ నియంత్రణ గుణాల వల్ల దీనికి డిమాండ్ పెరిగింది.

ఖానాపూర్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు, నిర్మల్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం పూర్తి స్థాయి కమిటీని నియమించారు. ఈ కమిటీలో ఖానాపూర్ మండలం దిలావర్పూర్ గ్రామానికి చెందిన రాసమల్ల అశోక్ ను జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT), బాసర క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి పీయూసీ-1 విద్యార్థులకు స్టూడెంట్ వెల్ఫేర్ విభాగం కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ నిబంధనల ప్రకారం, క్యాంపస్‌లోకి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు మాత్రమే ప్రవేశం కల్పించబడుతుంది.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎస్సి డిపార్ట్మెంట్ రాష్ట్ర అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు, నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతనంగా పూర్తి స్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీలో ఖానాపూర్ మండలం దిలావర్పూర్ గ్రామానికి చెందిన రాసమల్ల అశోక్ ను నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం నూతన ఉద్యోగ ఆరోగ్య పథకం (NEHS) మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం ద్వారా 40 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు ఏడాదికి ఒకసారి ఉచిత మాస్టర్ హెల్త్ చెకప్ అందించనున్నారు. దీంతో పాటు, అవుట్ పేషెంట్ (OP) సేవలు, ల్యాబ్ పరీక్షలపై 50% రాయితీ లభించనుంది.

2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ అప్పు ₹201.17 లక్షల కోట్లకు చేరుతుందని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరీ పార్లమెంట్లో వెల్లడించారు. 2014-15లో ₹64.11 లక్షల కోట్లుగా ఉన్న ఈ అప్పు, గత 11 ఏళ్లలో 214% మేర పెరిగింది.

USతో ట్రేడ్ డీల్‌ను వ్యతిరేకిస్తూ దేశ్ బచావో మోర్చా పిలుపునిచ్చిన మహాపంచాయత్‌లో పాల్గొనేందుకు రైతులు ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఇప్పటికే CJP ఆందోళనలతో అట్టుడుకుతున్న నగరంలో ఈ ధర్నా జరగనుంది. దేశవ్యాప్తంగా 550 రైతు సంఘాలు, సోషల్ ఆర్గనైజేషన్స్ ఈ కార్యక్రమంలో పాల్గొంటాయని తెలిపారు.

మందపల్లి గ్రామంలో సర్పంచ్ రజిత రాజేందర్ నేతృత్వంలో చేపట్టిన ప్రత్యేక సవరణ కార్యక్రమం (ఎస్ఐఆర్) విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఓటరు నివేదిక 100 శాతం పూర్తి చేయబడింది. ఈ లక్ష్య సాధనలో అధికారులు, ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించారు.

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురం గ్రామంలో సుమారు రూ.300 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సమీకృత పామ్ ఆయిల్ పరిశ్రమను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ప్రారంభించారు. ఈ పరిశ్రమతో రైతులకు అధిక దిగుబడి, మెరుగైన ఆదాయం లభిస్తుందని తెలిపారు.

తెలంగాణ రక్షణ సేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ రాథోడ్ బాపూరావు నాయకత్వంలో ఇచ్చోడా మండల మైనారిటీ చైర్మన్‌గా సేవలందిస్తున్న షేక్ ఫరీద్‌కు పార్టీ నాయకులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన చేస్తున్న సేవలు అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు.

ముధోల్ మండల ఉపసర్పంచుల ఫోరం నూతన కార్యవర్గాన్ని సోమవారం మండల కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా ఉపసర్పంచుల సంఘం అధ్యక్షుడు పొద్దుటూరి సంపత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఎన్నికలు నిర్వహించారు. నూతన కార్యవర్గం ఉపసర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపింది.

జాతీయ పోలీస్ అకాడమీలో తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక దాడి, వేధింపులకు పాల్పడిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అతడికి ఎస్సార్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.